
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మాటలు… ఆయన రాజకీయ భవిష్యత్‌పై చర్చకు దారితీశాయి. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారా…? వారసుడిని బరిలోకి దింపి.. వెనకుండి చక్రం తిప్పుతారా…? 2029లో అసలు అచ్చెన్నాయుడు పోటీనే చేయరా…? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కింజరాపు అచ్చెన్నాయుడు… టీడీపీలో సీనియర్ నేత. కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు. ఆయన వారసుడిగా రాజకీయాల్లో వచ్చారు. 1996లో హరిశ్చంద్రాపురంలో జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత… రాజకీయంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు అచ్చెన్నాయుడు. టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అయితే… ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు… ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ఆరు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి.. ఇంతకంటే తనకు ఏం కావాలని… అన్న భావనలో అచ్చెన్నాయుడు మాట్లాడినట్టు సమాచారం. అంటే… ఆయన ఇక… ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరా..? అన్న అనుమానం కలుగుతోంది. అయన అలా అనడానికి కూడా కారణం ఉంది. నిజానికి… యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. సీనియర్ నేతలకు పార్టీలో మంచి హోదా కల్పించింది… యువ నేతలను పోటీలో పెట్టాలన్నది తెలుగు దేశం ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అందుకే అచ్చెన్నాయుడు ఇలాంటి మాటలు అనుండొచ్చని భావిస్తున్నారు.
టీడీపీ వ్యూహాల ప్రకారం… 2029 ఎన్నికల్లో అచ్చెన్నా యుడు తప్పుకుని.. రాజకీయ వారసుడిగా తన కుమారుడిని బరిలోకి దింపాలని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. లోకేష్ టీమ్‌లో రామ్మోహన్‌నాయుడిది కీలక పాత్ర అని కూడా అంటున్నారు. భవిష్యత్‌లో రామ్మోహన్‌నాయుడు మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో… అచ్చెన్నాయుడు కూడా తన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని యోచిస్తున్నట్టు సమాచారం. కింజరాపు సోదరులను ముందు పెట్టి… వెనకుండి రాజకీయం నడిపించాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.