రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే..?

ఖరారైన రైల్వే టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎంత మొత్తం తిరిగి వస్తుంది అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.

ఖరారైన రైల్వే టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎంత మొత్తం తిరిగి వస్తుంది అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు. ప్రయాణం రద్దయితే పూర్తి డబ్బులు వస్తాయనే భావనలో చాలామంది ఉంటారు. కానీ రైల్వే శాఖ నిర్దేశించిన సమయానికి అనుగుణంగా రద్దు చేస్తేనే కొంత మొత్తం రిఫండ్ లభిస్తుంది. టికెట్ రద్దు సమయాన్ని బట్టి ఛార్జీలు మారుతాయని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు ఖరారైన టికెట్‌ను రద్దు చేసుకుంటే కనీస రద్దు ఛార్జీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్లకు రూ.240, ఏసీ సెకండ్ క్లాస్‌కు రూ.200 రద్దు ఛార్జీగా కట్ చేస్తారు. ఇక థర్డ్ ఏసీ, ఏసీ ఛైర్ కార్, థర్డ్ ఏసీ ఎకానమి టికెట్లపై రూ.180 మినహాయిస్తారు.

స్లీపర్ క్లాస్ టికెట్ రద్దు చేస్తే రూ.120, సెకండ్ క్లాస్ సిట్టింగ్ టికెట్‌కు రూ.60 కనీస రద్దు ఛార్జీగా తీసుకుంటారు. ఈ మొత్తాన్ని టికెట్ ఛార్జీలో నుంచి కట్ చేసి మిగిలిన డబ్బును ప్రయాణికుల ఖాతాలో జమ చేస్తారు. ఈ విధానం ఎక్కువ మంది ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం కలిగిస్తోంది.

రైలు బయలుదేరే సమయానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేస్తే రిఫండ్ మొత్తంలో భారీ కోత పడుతుంది. మొత్తం టికెట్ ఛార్జీలో 25 శాతం మేర డబ్బులు రద్దు ఛార్జీగా మినహాయిస్తారు. అయితే ఇది కూడా కనీస రద్దు ఛార్జీకి లోబడి ఉంటుంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఇక రైలు బయలుదేరే సమయానికి 12 గంటల నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే పరిస్థితి మరింత కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే మొత్తం ఛార్జీలో 50 శాతం డబ్బులను రద్దు ఛార్జీగా కట్ చేస్తారు. మిగిలిన సగం మొత్తాన్ని మాత్రమే ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు.

రైలు బయలుదేరే సమయానికి 4 గంటల లోపు టికెట్‌ను రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. ఈ నిబంధన చాలా మందికి నష్టంగా మారుతోంది. అందుకే ప్రయాణం రద్దు అయితే వీలైనంత త్వరగా టికెట్ క్యాన్సిల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు మాత్రం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇవి రద్దు చేసుకుంటే అరగంట లోపు రూ.60 మాత్రమే రద్దు ఛార్జీగా తీసుకుంటారు. ఆ తర్వాత రద్దు చేస్తే డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు. ఈ కారణంగా ప్రయాణికులు తమ టికెట్ స్థితిని ముందుగానే చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: Suicide: యువతి నిండు ప్రాణం తీసిన టీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button