
చండూరు, క్రైమ్ మిర్రర్:- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించే కనీస అర్హత చల్లమల కృష్ణారెడ్డికి లేదని.. ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఏ పార్టీ అని తిరుగుతాడో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడో అది కూడా చూస్తామంటూ చండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత దోటి వెంకటేశ్ యాదవ్ హెచ్చరించారు. ఆయన గురువారం క్రైమ్ మిర్రర్ ప్రతినిధితో మాట్లాడారు. గత ఎన్నికల్లో పోలింగ్ ముందు కాడెత్తేసిన చల్లమల రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కార్యకర్తలను ఎలా చూసుకోవాలో అది మా పార్టీకి చెందిన వ్యవహారం అన్నారు. రాజగోపాల్ రెడ్డి కలియుగ దాన కర్ణుడు అని… అయన మానవత్వంతో అనేక సహాయాలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ఆయన చేసిన సహాయం ఏంటో ఒక్కసారి మీ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని చల్లమల కృష్ణారెడ్డికి హితవు పలికారు. తన కొడుకు పెళ్లి క్యాటరింగ్ కు డబ్బులు ఎగ్గొట్టి నానా మాటలు పడ్డ చల్లమల రాజగోపాల్ రెడ్డి గారి లాంటి వ్యక్తులతో పైన మాట్లాడడానికి సిగ్గుండాలి అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే రోడ్లపై ఉడికించక తప్పదని హెచ్చరించారు.
Read also :- అవును మునుగోడులో నా ఎంట్రీ నిజమే : చలమల్ల కృష్ణారెడ్డి
Read also : పులివెందుల గడ్డ.. ఇప్పుడు టీడీపీ అడ్డా!.. షాక్ లో వైసీపీ?