
Weather: దేశవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్‌లోకి వెళ్లిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
తెలంగాణలో చలి పరిస్థితి
ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు అధికంగా ఉన్నాయి. సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు ఉన్నాయి. ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించాయి.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, బేగంపేట, చందానగర్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, మల్కాజిగిరి, ఫలక్‌నామా, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, హయత్‌నగర్, కార్వాన్, అంబర్‌పేట, గోషామహాల్, కాప్రా, ముషీరాబాద్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో చలి పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, దట్టమైన పొగమంచుతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోస్తా, రాయలసీమలో శుక్రవారం అనేక చోట్ల చలి తీవ్రత కొనసాగింది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసింది. అల్లూరి జిల్లాలోని జి.మాడుగులలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు నమోదైంది.
ALSO READ: BBC Apologies: డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా?





