
Heavy Rain In AP: రుతుపవనాల ప్రభావంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 5 రోజుల పాటు వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు భారీగా ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
మూడు రోజులుగా వానలే వానలు
అటు ఏపీలోని పలు జిల్లాలో గత మూడు రోజులుగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా మన్యం జిల్లాలో వర్షం కారణంగా చలి గాలులు వీస్తున్నాయి. పాడెరులో మంగళవారం నాడు ఎడతెరిపిలేని వాన పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనజీవనం స్తంభించింది. జనాలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ముంచంగిపుట్టులో అత్యధిక వర్షపాతం
అటు మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. ఈ ప్రాంతంలో ఏకంగా 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కూనవరం 22.2, జి.మాడుగుల, మారేడుమిల్లి 19.2. వరరామచంద్రపురం 16.4, గంగవరం 14.8, చింతూరు, హుకుంపేటల్లో 14.6 చొప్పున, ఎటపాక 12.8 మి.మీ. వర్షపాతం రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. రాగల 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, రాష్ట్రంలో భారీ వర్షాలు