Homeఅంతర్జాతీయంఇరాన్ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని తుడిచిపెట్టాం...డొనాల్ట్ ట్రంప్‌....!

ఇరాన్ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని తుడిచిపెట్టాం…డొనాల్ట్ ట్రంప్‌….!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియాలో యుద్దం రోజు రోజుకు తీవ్ర‌రూపం దాల్చుతుంది. తాజాగా ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌పై భీక‌ర దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ దాడుల్లో మిలిట‌రి నాయ‌కులు, అగ్ర‌నాయ‌క‌త్వంను పూర్తిగా నాశనం చేశామ‌ని తెలిపారు. దాడుల‌కు సంబంధించి వీడియోను సోష‌ల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. చ‌నిపోయిన ఇరాన్ మిలిట‌రి అధికారుల పేర్ల‌ను వెల్ల‌డించ‌లేదు.

‘టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 48 గంటల్లోగా హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తాజా దాడులు జరిగినట్టు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments