
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ల గురించి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దె దించుతామని హెచ్చరించారు. తాజాగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ల గురించి చర్చ జరగాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే బిల్లును కేంద్రానికి పంపామని.. ఈ బిల్లును వెంటనే కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దించుతామని సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలో భాగంగా హెచ్చరించడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొంతమంది బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : సీఎం రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు
Read also: వైసీపీ ప్రభుత్వం లోనే ఊరు పేరు లేని మద్యం తెచ్చి ప్రాణాలతో ఆడుకున్నారు : టీడీపీ నేత