తెలంగాణ

రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రాలతో కాదు పోటీ చేయాల్సింది… ప్రపంచంతో పోటీచేయాలనేదే మా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన అప్పటినుంచి రాష్ట్రాన్ని ఏదో ఒక అభివృద్ధి బాటలో నడిపించాలని చూస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఏమేం కావాలో ప్రతి ఒక్క దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాదులోని జీనో వ్యాలీలో ఐకార్ బయోలజిక్స్ కొత్త యూనిట్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో మన భారత దేశంలోని వ్యాక్సిన్ 33%, 43% బల్క్ డ్రగ్స్ కూడా ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అని అన్నారు.

కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఎంతోమంది సరైన వ్యాక్సిన్లు, సరైన వైద్యం లేక మరణించారని గుర్తు చేసుకున్నారు. అలాంటి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టిన సమయంలోనే మన తెలంగాణ నుంచి ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేశామని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పారిశ్రామిక విధానాలు ఎప్పుడు కూడా మారవు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాకు ఉన్నది ఒకటే ఒక లక్ష్యం. అది తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి పక్కపక్కనున్నటువంటి రాష్ట్రాలతో కాకుండా… ఏకంగా ప్రపంచం తోనే పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలానే ఉంటుందని… ప్రపంచంలోనే పోటీ పడుతామని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అభినందిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!.. ఏపీలో ఆసక్తికర పరిణామం?

నిమిష ఉరిశిక్ష వాయిదా, యెమన్ సర్కారు సంచలన నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button