
Shashi Tharoor: భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఎగుమతులపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించడం అన్యాయం అన్నారు. చైనా భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నా, వాళ్లకు మినహాయింపు ఇచ్చారని విమర్శించారు. భారత్ పై చైనా కంటే అధిక సుంకాలు విధిస్తూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా పైనా 50 శాతం సుంకాలు విధించాలి!
భారత ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. “మన దేశం దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అలాంటి సమయంలో అధిక దిగుమతి సుంకాలు విధిస్తే, మన ఉత్పత్తులను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. ఎందుకు కొనుగోలు చేయాలని ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చైనా రష్యా నుంచి భారత్ కన్నా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. అమెరికా ఆ దేశానికి 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. కేంద్రం కూడా అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకం విధించడంపై ఆలోచించాలి. ఇతర దేశాల బెదిరింపులకు లోనవకుండా భారత్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది” ఇదేనని అన్నారు.
Read Also: రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!