
-
ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవితాలకకు వర్షాలే ఆధారం
-
ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి లాభం చేకూర్చుతాయి
-
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు విజయవంతం కావాలి
-
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మోదీ ప్రెస్‌మీట్
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత మొదటి సారి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ మీడియా ద్వారా జాతికి సందేశమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సైనిక శక్తిని ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో వంద శాతం లక్ష్యాలను సైన్యం ఛేదించగలిగిందని కొనియాడారు. ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో ఆర్మీ తెలియజెప్పిందన్నారు. తక్కువ సమయంలోనే టార్గెట్‌ను కొట్టి చూపించిందని మోదీ కొనియాడారు.
అలాగే యాక్సియం-4 మిషన్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. అంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర సృష్టిందన్నారు. అలాగే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలపైనే రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు విజయంతం కావాలని మోదీ ఆకాంక్షించారు.
Read Also: