Sunday, March 8, 2026
HomeజాతీయంWater melon: కల్తీ పుచ్చకాయలను ఎలా గుర్తించాలో తెలుసా?

Water melon: కల్తీ పుచ్చకాయలను ఎలా గుర్తించాలో తెలుసా?

Water melon: ఈ సంవత్సరం వేసవి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఏప్రిల్ నెల పూర్తిగా ప్రారంభం కాకముందే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటి చల్లని పానీయాలతో పాటు శరీరానికి చలువ చేసే పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు.

అలాంటి పండ్లలో పుచ్చకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పీచు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు.

అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ సమస్య పెరుగుతోంది. కొందరు వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండేలా చేయడానికి లేదా లోపలి భాగం ఎర్రగా కనిపించేలా చేయడానికి రసాయన ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పండ్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పుచ్చకాయ సహజమైనదా లేదా కల్తీదా అని తెలుసుకోవడానికి కొన్ని సులభమైన సూచనలు ఇచ్చింది.

పుచ్చకాయ కల్తీని గుర్తించే సింపుల్ టెస్ట్..

* ముందుగా పుచ్చకాయ కొనేటప్పుడు చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమని అడగాలి.

* ఆ ముక్క లోపలి భాగాన్ని కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్‌తో స్వల్పంగా రబ్ చేయాలి.

* రబ్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పుచ్చకాయ కల్తీ చేసినదిగా భావించాలి.

* అలాంటి సందర్భాల్లో పుచ్చకాయలో ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి ఎర్రగా కనిపించేలా చేస్తారని నిపుణులు చెబుతున్నారు.

* టిష్యూ రంగు మారకపోతే ఆ పుచ్చకాయ సహజమైనదిగా భావించవచ్చు.

కార్బైడ్ వాడకంపై జాగ్రత్త..

* మామిడిపండ్ల మాదిరిగానే పుచ్చకాయలను కూడా కొంతమంది వ్యాపారులు త్వరగా పండించేందుకు కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.

* ఇలాంటి పండ్లపై కొన్నిచోట్ల పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి.

* అలాంటి పండ్లు ఆరోగ్యానికి మంచివి కావు.

* ఒకవేళ పసుపు మచ్చలు కనిపిస్తే తినే ముందు ఉప్పు నీటితో బాగా కడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కొనేటప్పుడు మరో ముఖ్యమైన విషయం..

* పుచ్చకాయను కొనుగోలు చేసే ముందు దాని పైభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.

* కాయపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తే వాటిని కొనకపోవడం మంచిది.

* ఎందుకంటే అవి ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ సరైన పండును ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ALSO READ: Best Places To Visit: వేసవి టూర్ ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలు మిస్ కాకండి..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments