ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు ప్రస్తుతం కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ ను చంపేస్తానని గుర్తుతెలియని వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు మెసేజ్ పంపినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఇక వెంటనే అధికారులు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇప్పటికే ఈ విషయంపై పేషి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే ఈ ఫిర్యాదు పై దర్యాప్తు చేస్తున్నారు.
Rede More : బ్రేకింగ్ న్యూస్!… బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్
మన భారతదేశంలో ఇప్పటికే చాలా మంది హీరోలను చంపేస్తా మంటూ బెదిరింపు కాల్స్ అలాగే మెసేజ్లు వచ్చిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని కొద్దిరోజుల ముందే సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని కూడా చంపేస్తామని బెదిరింపులు రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు మరియు జనసేన అభిమానులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Read More : ఏలూరులో దారుణం!… హాస్టల్ బాత్రూంలో విద్యార్థి డెలివరీ?
అయితే మన తెలుగు రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇంటి బెదిరింపులు రాగా పోలీసులు అందరు కూడా వెంటనే అలెర్ట్ అయ్యారు. పోలీసులు కూడా ఇప్పటికే ఈ మెసేజ్లు చేసినటువంటి వ్యక్తిని గుర్తించడానికి సర్వత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి మెసేజ్లు రాకుండా ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క మానవుడు కూడా అధికారులకు విన్నపిస్తున్నారు.