
Army Chief On Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సిందూర్ గురించి మరోసారి స్పించారు. అందరూ అనుకుంటున్నట్లు ఆపరేషన్ సిందూర్ మే 10న ముగియలేదన్నారు. అధికారికంగా ఆ రోజున కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. ఆపరేషన్ సిందూర్ మరికొంతకాలం కొనసాగిందన్నారు. పాక్‌తో మే 10న యుద్ధం ముగిసిందని అందరూ అనుకున్నారని, కానీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈ ఆపరేషన్ మరింత కాలం కొనసాగిందని తెలిపారు. పాక్ తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ స్పష్టమైన వ్యూహాలతో ముందుకు వెళ్లిందని ఆయన వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ గురించి..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టింది. భారత త్రివిద దళాలు సమన్వయంతో భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించి పాక్ లోని ఉగ్ర స్థావరాలను చిన్నాభిన్నం చేశాయి. ఈ దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాలను సైతం భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంది. పాక్ చేసిన డ్రోన్ దాడులు, క్షిపణి దాడులను తిప్పికొట్టింది. అదే సమయంలో మిస్సైల్స్ ను ప్రయోగించి పాక్ పై విరుచుకుపడింది. ఇండియన్ ఫోర్సెస్ దెబ్బకు విలవిల్లాడిన పాక్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయాలని వేడుకుంది. దాంతో భారత్ కూడా సంయమనం పాటిస్తూ కాల్పుల విరమణకు అంగీకరించింది.