
మహేశ్వరం ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కొద్దిగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో 105 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
అయితే, చెక్కులు అందుకున్న మహిళలు ఒక్క మాటతో అధికారులను ఆశ్చర్యపరిచారు తులం బంగారం హామీ ఏమైంది..?అని వేదికపైనే ప్రశ్నలు గుప్పించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం అందిస్తామని చెప్పిందని గుర్తు చేస్తూ, ఆ హామీని నిలబెట్టుకోవాలని మహిళలు గట్టిగా డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని. ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని, హామీలను అమలు చేయాలి,అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,మహిళలు పాల్గొన్నారు.