సినిమా

వార్-2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. తారక్ మాటలకు ఫ్యాన్స్ ఫిదా!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న సినిమా వార్ -2. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికీ విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన వార్ -2 సినిమా దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒకవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా నటిస్తున్న సినిమా కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా నిన్న హైదరాబాదులో ఎంతో ఘనంగా వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయ్యారు.

Read also : కోహ్లీ, రోహిత్ ఫామ్ లో ఉంటే ఆడించాలి.. టీమిండియా ప్రత్యేకంగా ఎవరికోసం ఆగదు : గంగూలీ

తాత ఎన్టీఆర్ ఆశీస్సులు నాపై ఉన్నంతకాలం నన్ను ఏ ఒక్కరూ ఆపలేరని జూనియర్ ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఓకే తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను కడుపులో పెట్టుకొని.. నేను చేసిన తప్పులను క్షమిస్తూ.. బాధలో నా వెన్నంటే ఉండి భుజాన్ని తట్టారు. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ అభిమానుల రుణాన్ని తీర్చుకోలేనని ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా చెప్పుకొచ్చారు. మీ ప్రేమ పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ జన్మకు ఇంతకంటే ఇంకేం కావాలి అని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అభిమానులు సైతం ఫిదా అయ్యారు.మరోవైపు హృతిక్ రోషన్ కూడా తెలుగు ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నా సొంత తమ్ముడు అయిపోయాడని హృతిక్ రోషన్ అన్నారు.

Read also : మునుగోడు ఎమ్మెల్యే పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు : మండల పార్టీ అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button