
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మరో ఐదు రోజులలో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ ఐదు రోజులలో ఇప్పటివరకు గడిచిన కాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఎంతోమంది ఈ 2025 ఇయర్ లో సక్సెస్ అయిన వారు ఆ సక్సెస్ను తలుచుకుంటూ ఇది హ్యాపీ ఇయర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ఇక సక్సెస్ కానటువంటి వారందరూ కూడా ఇది కూడా బ్యాడ్ ఇయర్ అంటూ మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనలు చాలామందిలో ఉంటాయి కానీ వాటికి సంబంధించి ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఇటువంటి తరుణంలోనే కొంతమంది సక్సెస్ అయిన వ్యక్తులు చెబుతున్న విషయాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం.
Read also :- అమ్మ సెంటిమెంట్ తో మ్యూజిక్ డైరెక్టర్ ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు?
కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని ఎంత అయితే సంతోషిస్తామో.. మన జీవితంలో కూడా ఏదో ఒక మార్పు చేసుకోవాలని కూడా అంతే గట్టి ఆనందంగా ట్రై చేస్తూ ఉండాలి. భవిష్యత్తు గురించి బాధపడకుండా ఇప్పటినుంచే ప్రతిరోజు కూడా ఎంతో కొంత చిన్న అమౌంట్ ను సేవ్ చేసుకుంటూ ఉంచండి. ఎందుకంటే అదే భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సహాయంగా ఉంటుంది. వీటి కోసం ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ అలాగే స్టాక్స్ వంటి వాటిలో ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఇంకోవైపు ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంతే ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు 8000 నుంచి 10000 అడుగుల దూరం నడవడం ట్రై చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ వేడి నీరు తాగడం అలవాటు చేసుకోవడం వల్ల రోజు మొత్తం కూడా ఏ పని చేసినా ఉత్సాహంగా ఉంటారు. ఇక ఉద్యోగం కోసం ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏఐ, పెయింటింగ్, క్రియేటివ్ రైటింగ్ లేదా కంటెంట్, డాన్స్, సింగింగ్, టెక్నాలజీ వీటిలో ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే కానీ భవిష్యత్ లో నిరుద్యోగి కాకుండా ఉంటారు.
Read also : పెన్సిల్ ఛాతిలో గుచ్చుకొని UKG బాలుడు మృతి!





