క్రీడలు

మొదటి మ్యాచ్ లోనే ఘన విజయం … కోహ్లీ మరో రికార్డు!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లోనే ఘనవిజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు ఆర్సిబి మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 174 పరుగులు చేసింది. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ సి బి 16.2 ఓవర్ల లోనే చేదించింది. చేజింగ్ మాస్టర్ కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. మొదట్లో కేకేఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా వేగంగా పరుగులు చేశారు. చివరిలో మ్యాచ్ మొత్తం ఆర్ సి బి వైపు మలుపు తిరిగింది. ఇక చేజింగ్ లోను ఆర్సిబి బ్యాటర్స్ అదుర్స్ అనిపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా BRSV నాయకుల అక్రమ అరెస్టులు!..

అయితే మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా కోహ్లీ మరో కొత్త రికార్డును సృష్టించాడు. విరాట్ కోహ్లీకి ఇది 400 వ టి20 మ్యాచ్ కావడం విశేషం. టి20 ఫార్మేట్ లో 400 మ్యాచ్లు ఆడిన 3వ భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డును నిలిపాడు . మొదటి స్థానంలో రోహిత్ శర్మ (448) ఉండగా రెండో స్థానంలో దినేష్ కార్తీక్ (412) ఉన్నారు. అంతేకాకుండా ఐపీఎల్లో కేకేఆర్ పై 1000 పరుగుల మైలురాయినందుకున్న మూడో క్రికెటర్ గా కోహ్లీచారు. దాదాపు 18 ఏళ్లుగా కప్పు కోసం పోరాడుతున్న బెంగళూరుకి ఈ 18వ సీజన్లోనైనా సరే కప్పు కొడుతుందా? అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొదటి మ్యాచ్ లోనే శుభారంభం లభించింది.

జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button