జాతీయంవైరల్

VIRAL VIDEO: మధ్యలో నువ్వేంది.. పోలీసును నెట్టేసిన ఏనుగు

VIRAL VIDEO: దేవాలయాల్లో సేవ చేసే ఏనుగులు భక్తులతో కలిసి పెరిగినట్లు, వారి ప్రవర్తనను అర్థం చేసుకుని ఎంతో వినయంగా రోజువారీ సేవను కొనసాగిస్తాయి.

VIRAL VIDEO: దేవాలయాల్లో సేవ చేసే ఏనుగులు భక్తులతో కలిసి పెరిగినట్లు, వారి ప్రవర్తనను అర్థం చేసుకుని ఎంతో వినయంగా రోజువారీ సేవను కొనసాగిస్తాయి. మనుషుల మధ్యే జీవించే ఈ ఏనుగులు భక్తుల సంచారం, వారి హావభావాలు, ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు అన్నింటిపై ఓ ప్రత్యేక అవగాహన కలిగి ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే అవి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. కానీ ఎక్కువ కాలం దైవ సంప్రదాయాల్లో భక్తి భావంతో సేవ చేస్తూ వాటి జీవితం సాగుతుంది. ఇలా దేవాలయాల్లో ప్రశాంతంగా ఉండే ఏనుగు అకస్మాత్తుగా చేసిన ఆశ్చర్యకర చర్య తాజాగా వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది.

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుక్కే పట్టణంలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నీటి ఉత్సవం సందడిగా కొనసాగుతుండగా వందలాది మంది భక్తులు ఉత్సవంలో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆలయ ఏనుగు యశస్విని, భక్తులు చల్లే నీళ్లను ఎంజాయ్ చేస్తూ అల్లరి చేసే చిన్నపిల్లలా ఆనందం వ్యక్తం చేస్తోంది. యశస్విని ముందుకు ఎవరూ రావద్దని అనుకుందో.. ఏమో గానీ.. అకస్మాత్తుగా పోలీస్ తనకు అడ్డుగా నిలిచాడనే భావన కలిగింది. వెంటనే తన పొడవాటి తొండంతో అతణ్ణి సులభంగా ఎత్తి పక్కకు పడేసింది. అక్కడ కొద్ది క్షణాలు భయం కలిగేలా కనిపించినా.. భక్తులు మాత్రం ఏనుగుపై నీళ్లు చల్లడంలోనే పూర్తిగా మునిగిపోయి ఏం జరిగింది అన్నది కూడా పట్టించుకోలేదు. యశస్విని తనపై పడే చల్లటి నీటితో ఉల్లాసంగా అల్లరి చేస్తూ వేడుకలో ఆనందాన్ని మరింత పెంచింది.

ఈ ఘటనను చూసిన వారంతా పోలీస్ పై ఒక్క క్షణం జాలి పడినా, ఏనుగు చేసిన ఆ ముద్దు అల్లరిని చూసి నవ్వుకోక మానలేదు. డ్యూటీలో ఉన్న పోలీస్ గాయపడకపోవడం, ఏనుగు దాడి ఉద్దేశపూర్వకమైంది కాదని తెలిసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ ఏనుగు యశస్విని కథ కూడా అంతే విశేషం. బళ్లారి జిల్లాలోని హెస్పేట్‌కి చెందిన వ్యాపారవేత్త బీఎస్ ఆనంద్ సింగ్ మూడు సంవత్సరాల వయసులో ఉన్న ఈ ఏనుగును రూ.20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి కుక్కే దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. నేపాల్ సరిహద్దులోని గోపాలగంజ్ నుంచి అస్సాంలోని ఏనుగుల సంతకు తీసుకువచ్చిన యశస్విని, అప్పటి నుంచి దేవాలయంలో దైవ సేవను కొనసాగిస్తూ 15 ఏళ్లుగా భక్తుల మన్ననలు పొందుతోంది. శాంతస్వభావం, భక్తులంటే ఇష్టం, ఆలయ ఉత్సవాల్లో పాల్గొనే తీరు అన్నీ యశస్వినిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ALSO READ: Saves Life: ‘దైవం మానుష రూపేణ’ అంటే ఇదేనేమో.. పెళ్లిలో కుప్పకూలిన మహిళను కాపాడిన వధువు

Back to top button