Meerut Viral News: సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలి డాక్టర్ దగ్గరికి వెళ్తే.. గాయం తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. గాయం చిన్నగా ఉంటే.. శుభ్రం చేసి ఆయిట్మెంట్ పూసి, నొప్పి తగ్గిందుకే మందులు ఇచ్చి పంపిస్తారు. దెబ్బ కాస్త పెద్దగా ఉంటే, కుట్లు వేస్తారు. కానీ, కొంత మంది చదువు, సంధ్య లేని వ్యక్తులు డాక్టర్ల మంటూ చలామణి అవుతున్నారు. అలాంటి వారు చేసే ట్రీట్మెంట్ చాలా మంది ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి. తాజాగా మీరట్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
ఇంతకీ అసలు ఏమైందంటే?
మీరట్ లోని జాగృతి విహార్ ఎక్స్ టెన్షన్ లోని మాపుల్స్ హైట్స్ లో సర్దార్ జస్పిందర్ దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఓ చిన్న బాబు ఉన్నాడు. తాజాగా ఆడుకుంటఊ కింద పడ్డాడు. అతడి కన్ను సమీపంలో దెబ్బ తగిలింది. బాగా రక్తం వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు ఆ బాబును.. దగ్గర ఉన్న ఓ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడిని చూసిన డాక్టర్.. రూ. 5 ఫెవిక్విక్ తీసుకువచ్చి గాయం అయిన చోట ప్యాచ్ వేశాడు. కాసేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుందంటూ వారికి చెప్పి పంపించేశాడు. కానీ, ఆ అబ్బాయి నొప్పితో తల్లడిల్లిపయాడు. వెంటనే వాళ్లు మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
ఫెవిక్విక్ అంటించడాన్ని చూసి షాక్!
అక్కడి డాక్టర్లు గాయమైన చోట ఫెవిక్విక్ అంటించడం చూసి షాకయ్యారు. ఆ ఫెవిక్విక్ తొలగించడానికి డాక్టర్లకు 3 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత బాబుకు నాలుగు కుట్లు వేసి, చికిత్స అందించారు. ఫెవిక్విక్ కంట్లోకి వెళ్లి ఉంటే కళ్లు పోయేవని డాకర్లు తెలిపారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారులు స్పందించారు. ఫెవిక్విక్ తో ట్రీట్‌మెంట్ చేసిన నకిలీ డాక్టర్ మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.





