మన భారతదేశానికి శత్రుదేశం ఉందని అనగానే వెంటనే గుర్తుకు వచ్చే దేశం పాకిస్తాన్. మనం చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ పేరు వినగానే శత్రుదేశం అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయి ఉంటాం. అయితే తాజాగా పాకిస్తాన్ అనే పేరు మీద ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కాలనీ ఉండడం వల్ల ఆ కాలనీ వారందరూ కూడా మాకు కాలనీ పేరు వద్దంటూ ఆందోళన చేపట్టారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విగ్గు పెట్టుకుని అమ్మాయిలు మోసం చేస్తున్న గచ్చిబౌలి యువకుడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ‘పాకిస్తాన్’ అనే పేరు గల కాలనీ ఒకటి ఉంది. తాజాగా ఆ కాలనీ పేరు ను మార్చాలంటూ అ కాలనీ స్థానికులు ఆందోళన చేపట్టారు. పాకిస్తాన్ అనే పేరు ఉండడంతో తమకు పలు సౌకర్యాలు అసలు అందట్లేదని, బయట పనుల నిమిత్తం ఎక్కడికెళ్ళినా మా కాలనీ పేరు చెప్పుకోలేకపోతున్నామని మా కాలనీవాసులు ప్రతిరోజు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు స్పందించి పేరు మార్చాలని వాటితో పాటుగా ఇళ్ల పట్టాలను కూడా అందివ్వాలని కోరారు.
ఈనెల 21వ తారీకున అద్భుతం జరగబోతోంది!… ఏంటంటే?
ఇక 1971లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు సరిహద్దుల్లోని ప్రజల కోసం విజయవాడ పాయకాపురంలో ఓ కాలనీ ఏర్పాటు చేసి ఆ కాలనీకి పాకిస్తాన్ అని పేరు పెట్టారని వాళ్ళు వివరంగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి మా కాలనీ పేరు వెంటనే మార్చి మాకు వెంటనే తగిన న్యాయం చేయాలని వారు మీడియాతో చెప్పుకొచ్చారు.