ఆంధ్ర ప్రదేశ్

ఆస్తి పంచాయతీలో విజయమ్మ, షర్మిలకు షాక్‌ – జగన్‌కు అనుకూలంగా తీర్పు

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:-
వైఎస్‌ ఫ్యామిలీలో ఆస్తి పంచాయతీ ఎప్పుడో రచ్చకెక్కింది. ఆ తర్వాత కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ చివరకు వైఎస్‌ జగన్‌దే పైచేయి అయ్యింది. న్యాయస్థానం జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వైఎస్‌ విజయమ్మ, షర్మిల్‌కు మాత్రం షాక్‌ ఇచ్చింది కోర్టు. ఇంతకీ… ఏంటీ ఆస్తి వివాదం..? ఏ కేసులో న్యాయస్థానం జగన్‌ పక్షాన తీర్పు ఇచ్చింది.సరస్వతి పవర్‌ వాటల బదిలీ… ఈ వ్యవహారం వైఎస్‌ కుటుంబంలో చిచ్చు పెట్టింది. సరస్వతి కంపెనీకి చెందిన తన వాటా షేర్లను.. కుమారుడు వైఎస్‌ జగన్‌కు తెలియకుండా.. కుమార్తె షర్మిలకు బదిలీ చేశారు విజయమ్మ. విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌, ఆయన భార్య భారతి… కోర్టుకు ఆశ్రయించారు. ఈ షేర్ల బదిలీని ఆపాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. ఆ కంపెనీలో 51.01 శాతం వాటా తమదే అని… తమకు తెలియకుండా విజయమ్మ… ఆ షేర్లను షర్మిలకు ట్రాన్స్‌ఫర్‌ చేసిందని… వెంటనే ఆ షేర్ల ట్రాన్స్‌ఫర్‌ను రద్దు చేయాలని కోరారు. అంతేకాదు… తమ వాటా తమకు తిరిగి ఇప్పించాలని గత ఏడాది కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరుపక్షాలు తమ వాదనలను న్యాయస్థానం ముందు ఉంచాయి.
నేటి తరంలో 100 అమ్మాయిల్లో నలుగురు మాత్రమే పవిత్రంగా ఉన్నారు: ప్రేమానంద్ మహారాజ్
సరస్వతి పవర్‌ కంపెనీలో షేర్ల బదిలీ న్యాయమే అని… అవి ఎప్పుడతో తన పరుపై బదిలీ అయ్యాయని… కంపెనీ జగన్‌ తల్లి విజయమ్మదే అని ఆమె తరపు లాయర్‌ వాదించారు. అయితే… అది తండ్రి వైఎస్‌ సంపాదించిన ఆస్తి కాదని… జగన్‌ తరపు లాయర్‌ వాదించారు. 10 నెలలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు… మే 30న తీర్పును రిజర్వ్‌ చేసింది. జూన్‌ 29న తీర్పు ఇచ్చింది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న షేర్ల‌ను బ‌దిలీ చేయ‌డం కుదరదన్న జ‌గ‌న్ త‌ర‌పు వాద‌న‌ల‌తో NCLT ఏకీభ‌వించింది. విజయమ్మ, షర్మిల చేస్తున్న వాదనల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. షేర్ల బ‌దిలీని నిలిపేసింది. వైఎస్‌ జగన్‌ దంపతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
భక్తులతో కిటకిటలాడిన శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button