క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
వైసీపీ కీలక నేత విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జగన్ సన్నిహితుడు అయినటువంటి విజయ్ సాయి రెడ్డి వైసిపి పార్టీ ఆవిర్భవించిన అప్పటినుంచి వైసీపీ పార్టీకి కీలక నేతలుగా ఉన్న వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. కాబట్టి వైసిపికి కీలక నేతగా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ భవిష్యత్తును చూసుకుంటూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలవడం లో విజయ్ సాయి రెడ్డి కూడా ముఖ్యపాత్ర వహించాడు. ఆ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా 151 సీట్లతో ఘన విజయాన్ని అందుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యాడు.
విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్
అయితే తాజాగా రాజకీయాలకు విజయ్ సాయి రెడ్డి గుడ్ బై చెప్పడంతో ఒకవైపు అతను అభిమానులు మరోవైపు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అందులో ఒక కీలక నేతగా పనిచేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుండి తొలిగారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విజయ్ సాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వల్ల వైయస్సార్సీపి పార్టీకి నష్టమా లేదా లాభమా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ నిజం చెప్పుకోవాలంటే విజయ్ సాయి రెడ్డి లక్షల ఓట్లను ప్రభావితం చేసేటువంటి మాస్ లీడర్ అయితే కాదని ,కాబట్టి వైసిపి పార్టీ ఓటు బ్యాంకుకు ఎలాంటి నష్టం లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే మరోవైపు వైసీపీ పార్టీ తరఫునే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మూడు తరాలు అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అందరూ కూడా కొంచెం బాధకి గురయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా విజయసాయిరెడ్డి రాజకీయాలలో మెలిగారు. వైఎస్ఆర్సిపి పార్టీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలిచి , ఇప్పుడు రాజకీయాలకు రాజీనామా చేయడంతో వైసిపికి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇది బాధ పెట్టే విషయమే. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి పెద్దగా ప్రభావితం చూపదు.
నేడు పండుగ రోజు.. సత్ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీల విడుదల!!