
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కష్టం మీద కష్టం వస్తూనే ఉంది. తాజాగా విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈనెల 25వ తారీఖున విజయసాయిరెడ్డి మళ్ళీ విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు. కాగా బుధవారం నాడు కాకినాడ సిపోర్టు మరియు సేజ్ వ్యవహారంలో విచారణకు సిఐడి అధికారులు పిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 5 గంటల పాటు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో విజయసాయిరెడ్డిని విచారణ చేశారు. ఏదైనా అవసరమైతే మళ్లీ రావాలని సిఐడి అధికారులు ఆరోజునే చెప్పారు అట. కాగా నేడు విజయసాయిరెడ్డి సిఐడి అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.
కాగా ఇదంతా కాకినాడ సి పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారని విజయ్ సాయి రెడ్డిని గతంలో ఒకసారి మంగళగిరి సిఐడి పోలీసులు ప్రశ్నించారు. వాటాలు బలవంతంగా లాక్కున్నారా లేక ఏ విధంగా తీసుకున్నారు అనేదానిపై అధికారులు విచారణ జరిపారు. కె.వి. రావు ఫిర్యాదు మేరకు విజయ్ సాయి రెడ్డి తో పాటుగా మరో ఐదు మంది పై సిఐడి అధికారులు విచారణ అనేది చేపట్టారు. ఈ కేసులో ఏ వన్ గా విక్రాంత్ రెడ్డిని ఏ-2 గా విజయసాయిరెడ్డిని చేర్చారు.
ప్రక్షాళన జరిగితేనే వైసీపీకి లైఫ్ – తుక్కు ఏరకపోతే పార్టీ నిలబడటం కష్టమే..!