అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదలైన మరుసటి రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ హైలెట్గా నిలుస్తున్నాడు. సినిమా రిలీజ్ రోజు రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోవడం, ఆమె కొడుకు కూడా ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన మరుసటి రోజే అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి మధ్యంతర బెయిల్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు.
Read More : నాగబాబుకు అప్పగించే శాఖలు ఇవే!.. ఫిక్స్ అయినట్లే?
అల్లు అర్జున్ జైలు నుండి ఇంటికి రాగానే టాలీవుడ్ లోని సినిమా హీరోలు మరియు డైరెక్టర్లు అలాగే అల్లు అర్జున్ బంధువులు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక బెయిల్ మీద ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గురించి తాజాగా జాతకాలు చెప్పే వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More : కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
అల్లు అర్జున్ జాతకం ప్రకారం కచ్చితంగా రాజకీయాల్లోకి అడుగు పెడతారని చెప్పుకొచ్చారు. సొంతంగా 100% రాజకీయ పార్టీని స్థాపిస్తారని, పార్టీని స్థాపించడమే కాకుండా అల్లు అర్జున్ జాతకం ప్రకారం ముఖ్యమంత్రి కూడా అవుతారని వేణు స్వామి చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎందుకంటే ఈమధ్య జైలుకు వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతున్నారు కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో రాజకీయ పార్టీని స్థాపించి కచ్చితంగా సీఎం అవుతారని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ జాతకం ప్రకారం సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వేణు స్వామి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో వేణు స్వామి పై భారీ స్థాయిలో నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.