ఆంధ్ర ప్రదేశ్

తిరుమలకు వచ్చే VIP లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధిగాంచిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన దేశమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాంటి స్వామివారిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలే కాకుండా పెద్దపెద్ద విఐపి లు కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నేడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే విఐపి ల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో స్థానికులకే ప్రాధాన్యం
దేశంలో ఉన్నటువంటి వీఐపీలు ప్రతి ఒక్కరు కూడా ఒక ఏడాది కాలంలో ఒకసారి మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రావాలని సూచించారు. వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే రావడం వల్ల సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగదని వెంకయ్య నాయుడు అన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలలో తిరుమలకు వచ్చే ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా.. చాలా హుందతనంగా వ్యవహరించాలని.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సలహాలు ఇచ్చారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది విఐపి లు కూడా నిత్యం వస్తూనే ఉంటారు. వీఐపీలు కాబట్టి వారికి ప్రత్యేక భద్రతతో కూడిన విధానంలో స్వామివారిని దర్శించుకోవడానికి వీలుంటుంది. అలాగే వీఐపీలు అనగానే ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా వాళ్లని చూడడానికి వెళ్ళినప్పుడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి వీఐపీలు అనేవారు… ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి… స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే వారికి క్షణం పట్టదు. కాబట్టి ఏడాది కాలంలో ఒకసారి మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడంలో మీరు ఎలాంటి స్పందన ఇస్తారో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button