క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా వేచి చూస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కొంతవరకు పూర్తయినప్పటికీ.. మిగతా కొంత భాగం షెడ్యూల్ మిగిలి ఉంది. ఇక ఈ తరుణంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా వారణాసి మూవీపై అలాగే ఈ సినిమాలోని తన రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తన కెరీర్ డిఫైనింగ్ సినిమా అవుతుంది అని పేర్కొన్నారు. రాజమౌళికి ఉన్నటువంటి విజన్ మరొకరికి లేదు అని ఆమె అన్నారు. రాజమౌళితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని తెలిపారు. ఇక నా భవిష్యత్తు సినిమా కెరియర్ పై ఈ సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు అని ఆమె ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సినిమా 2027 ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు ముందుగానే చిత్ర బంధం ప్రకటించింది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఇన్ని నష్టాలా?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఇన్ని నష్టాలా?
