
-
తెలంగాణలో అట్టహాసంగా వన మహోత్సవం
-
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీలో కార్యక్రమం
-
మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో వన మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీలో వనమహోత్సవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్టార్ట్ చేశారు. సీఎంతో కలిసి మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని సూచించారు.
తెలంగాణ మొత్తం హరితవనం కావాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామన్నారు. అనంతరం బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, అక్కడ రుద్రాక్ష మొక్కను నాటారు రేవంత్ రెడ్డి. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.