జాతీయంలైఫ్ స్టైల్

Vajrasana: భోజనం తర్వాత 5 నిమిషాలు ఇలా చేస్తే ఎంత తిన్నా ఆరుగుతుందట!

Vajrasana: వజ్రాసనం యోగా సాధనలో అత్యంత సులభమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండే ఆసనంగా గుర్తింపు పొందింది.

Vajrasana: వజ్రాసనం యోగా సాధనలో అత్యంత సులభమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండే ఆసనంగా గుర్తింపు పొందింది. అనేక యోగా ఆసనాలకు ఇది ప్రాథమిక దశగా కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా యోగాను ఉదయం ఖాళీ కడుపుతో చేయడం అలవాటు. అయితే వజ్రాసనం మాత్రం భోజనం చేసిన తర్వాత కూడా చేయగలిగే అరుదైన ఆసనాల్లో ఒకటి. ఉదయం, సాయంత్రం మాత్రమే కాదు..న్న వెంటనే కూడా ఈ ఆసనం వేయవచ్చు అనే ప్రత్యేకత దీనికి ఉంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరిచే ఆసనంగా వజ్రాసనాన్ని యోగా నిపుణులు సూచిస్తుంటారు.

భోజనం చేసిన తర్వాత చాలామందికి అజీర్ణం, గ్యాస్, పొత్తికడుపు బరువుగా అనిపించడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కొంతసేపు నడవడం ఎంత ఉపయోగకారమో, అదే స్థాయిలో వజ్రాసనం కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. భోజనం చేసిన తర్వాత సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు వజ్రాసనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఆహారం కడుపులో సరిగ్గా జీర్ణమయ్యేందుకు ఇది సహాయపడుతుంది. తిన్న వెంటనే ఈ ఆసనం చేయవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.

వజ్రాసనం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాదు.. మలబద్ధకం సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను ఉత్తేజపరిచి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ధ్యానం, ప్రాణాయామం చేసే సమయంలో కూడా వజ్రాసనంలో కూర్చోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు శరీరం స్థిరంగా ఉంటుంది. తిన్న తర్వాత రోజూ 15 నిమిషాల పాటు వజ్రాసనం చేస్తే మెటబాలిజం మెరుగై పొత్తికడుపులో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గుతుంది. దీని ప్రభావంతో ఊబకాయం సమస్య కూడా అదుపులోకి వస్తుంది.

అసిడిటీ, గ్యాస్, ఆపానవాయువు వంటి సమస్యలతో బాధపడేవారికి వజ్రాసనం మంచి పరిష్కారంగా నిలుస్తుంది. ఆహారంలో ఉన్న పోషకాలు శరీరం సరిగా గ్రహించేలా చేయడంలో ఈ ఆసనం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా వజ్రాసనం ఉపయోగపడుతుంది. తొడలు, తుంటి కండరాలు బలపడతాయి. పొత్తికడుపు ప్రాంతంలో రక్తప్రవాహం పెరగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అంతేకాదు, కిడ్నీ సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా ఈ ఆసనం సహాయకారిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే వజ్రాసనం అందరికీ సరిపోతుంది అనుకోవడం పొరపాటు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. ముఖ్యంగా మోకాళ్ల సమస్యలు ఉన్నవారు, మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు వజ్రాసనం చేయరాదు. వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఆసనాన్ని నివారించాలి. పేగులో పుండు, అల్సర్, హెర్నియా వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా వజ్రాసనం చేయకూడదు.

వజ్రాసనం చేయడం చాలా సులభం. ముందుగా నేలపై మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత పాదాలను నిటారుగా ఉంచి మడమలను చాచి, శ్వాసను వదులుతూ నెమ్మదిగా మడమలపై కూర్చోవాలి. రెండు చేతులను తొడలపై ఉంచి నిటారుగా కూర్చోవాలి. ఆ తర్వాత లోతుగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ స్థితిలో ఉండాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ భంగిమలో కూర్చొని, ఆపై మెల్లగా సాధారణ స్థితిలోకి రావాలి. రోజూ అలవాటు చేసుకుంటే వజ్రాసనం ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తుంది.

NOTE: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. క్రైమ్ మిర్రర్ దీనిని ధృవీకరించట్లేదు, గమనించగలరు.

ALSO READ: College Farewell Day: చీరకట్టులో డ్యాన్స్ ఇరగదీసిన విద్యార్థిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button