తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి జరుపుతున్నామని ఆలయ అధికారులు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించి జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఇక వీటికి సంబంధించి టోకెన్లు ఒకరోజు ముందుగానే అంటే జనవరి 9 ఉదయం 5 గంటల నుంచి SSD టోకెన్లు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
అయితే ఈసారి ఈ టోకెన్లు ఎనిమిది ప్రదేశాలలో ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ ఏరియాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. రామచంద్ర పుష్కరిణి
2. జీవకోన జడ్పీ స్కూల్
3. ఇందిరా మైదానం
4. శ్రీనివాసం రెస్ట్ హౌస్
5. విష్ణు నివాసం
6. రెండవ చౌల్ట్రీ
7. రామానాయుడు హై స్కూల్ బైరాగి పట్టేడ
8. ఎంఆర్ పల్లి జడ్పీ స్కూల్
ఇక వీటితోపాటుగా తిరుమలలో ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు అని ఆలయ అధికారులు వెల్లడించారు. కాబట్టి ఈ వైకుంఠ దర్శనానికి టోకెన్లు తీసుకోవడానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారులు చెప్పారు.
పేదలకు గుడ్ న్యూస్… ఒక్కొక్కరికి ఆరు కిలోలు సన్న బియ్యం!!
అంతేకాకుండా ఈ టికెట్ తీసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని రూల్ పెట్టారు. ఇక ప్రతిరోజు కూడా 40,000 వరకు SSD టోకెన్లు ఆఫ్లైన్ ద్వారా ఇస్తున్నామని ప్రకటించారు. ఇక వీటికి సంబంధించి ఆన్లైన్ టోకెన్సు కోసం కూడా సపరేట్గా వెబ్సైట్లను క్రియేట్ చేశారు. మీరు అందులో కనుక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే టీటీడీ అధికారిక వెబ్సైట్కు వెళ్లి చేసుకోండి.
300 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు! మల్లారెడ్డి కాలేజీలో దారుణం