తెలంగాణ

బొడ్రాయి ఉత్సవానికి వడ్డేపల్లి దంపతుల రూ.16లక్షల విరాళం

  • హయత్‌నగర్‌లో ఘనంగా బొడ్రాయి ఉత్సవం

  • రూ.16లక్షలు విరాళమిచ్చిన వడ్డేపల్లి శ్రీశైలం దంపతులు

  • ధన్యవాదాలు తెలిపిన మాజీ కార్పొరేటర్‌ తిరుమల్‌ రెడ్డి

క్రైమ్ మిర్రర్, హయత్‌నగర్: హయత్‌నగర్‌లో బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల ఏర్పాట్ల కోసం తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, వినాయక్‌నగర్‌ నివాసి వడ్డేపల్లి శ్రీశైలం నేత దంపతులు రూ.16లక్షలు విరాళమిచ్చారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం దంపతులు పెద్ద మొత్తంలో విరాళమివ్వడం ద్వారా బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడిందని తెలిపారు. ఈ దాతృత్వం హయత్‌నగర్‌ ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇంత పెద్ద మొత్తంలో విరాళమిచ్చిన శ్రీశైలం దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. శ్రీశైలం దంపతుల సేవా కార్యక్రమాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button