Modi- Putin Selfie: రీసెంట్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యాటించారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ భారత పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించింది. ఈ పర్యటన ప్రపంచ దేశాలకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రయాపడింది.
ట్రంప్ పై అమెరికన్ల విమర్శలు
పుతిన్ భారత పర్యటనపై ఆమెరికాలో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా మోడీ-పుతిన్ తీసుకున్న సెల్ఫీ అమెరికాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. పుతిన్ భారత్‌లో దిగగానే ప్రధాని మోడీ స్వయంగా ఆయనకు స్వాగతం పలికి ఒకే కారులో కలిసి ప్రయాణించారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ అమెరికాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రంప్ విధానాల కారణంగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియా శత్రువుల చేతిలోకి వెళ్లిపోతోందంటూ అమెరికా చట్ట సభ సభ్యురాలు కమ్ లాగర్ హెచ్చరించారు. ట్రంప్ విధానాలు ఇరు దేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహనను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు
భారత్ ను అమెరికా రష్యాకు దగ్గర చేస్తుందని ఆగ్రహం
అమెరికా వ్యవహార శైలి భారత్‌ను రష్యా వైపునకు నెట్టేస్తోందని అగ్రరాజ్య ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇండో-పసిఫిక్ పరిరక్షణకు భారత్ అవసరం ఎంతో ఉందని చట్ట సభకు చెందిన మరో సభ్యుడు హుయిజెంగా వ్యాఖ్యానించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలు పెట్టుకోవడం తప్పిదమని అమెరికా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధ్రువ జైశంకర్ అన్నారు.





