Wednesday, March 18, 2026
Homeతెలంగాణపేద విద్యార్థిని మెడికల్ విద్యకు ఉప్పల వెంకటేష్ భరోసా

పేద విద్యార్థిని మెడికల్ విద్యకు ఉప్పల వెంకటేష్ భరోసా

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి న్యూస్ :-
ఆమనగల్లు మండలం నుచ్చుగుట్ట తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వర్త్యావత్ యశస్విని మెడికల్ విద్యకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు. సోమవారం వెలువడిన మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 445 ర్యాంకుని సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన యశస్విని మంగళవారం ఉప్పల వెంకటేష్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ ఆమెకు అభినందనలు తెలిపి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి గిరిజన బిడ్డ యశస్విని మెడిసిన్ పూర్తి చేయడం కోసం కొప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గిరిజన లంబాడ తండాల్లో పుట్టి, కన్నా తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగి నేడు ఉస్మానియా, గాంధీ వంటి మెడికల్ కళాశాలల్లో సీటును సాధించిన యశస్విని ఎంతోమంది గిరిజన బిడ్డలకు ఆదర్శమని ఉప్పల వెంకటేష్ కొనియాడారు.

పగబట్టిన పంచభూతాలు – వరుస ప్రమాదాలు దేనికి సంకేతం..!

శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments