క్రీడలు

దద్దరిల్లుతున్న ఉప్పల్.. ఆరెంజ్ ఆర్మీ రఫ్పాడించేనా?

హైదరాబాదీలను ఐపీఎల్ ఫీవర్ చుట్టుముట్టింది. ఆరెంజ్ ఆర్మీతో ఉప్పల్ దద్దరిల్లుతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తమ వేటను ప్రారంభించనుంది సన్‌ రైజర్స్‌. తొలిగేమ్‌లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది.

ఈ సారి హైదరాబాద్ అంటేనే ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి. క్యాసెన్, హెడ్, అభిషేక్ శర్మ వంటి అత్యంత భయంకరమైన బ్యాట్స్ మెన్ సన్ రైజర్స్ లో ఉన్నారు. ప్యాట్ కమ్మిన్స్, షమితో పాటు అడం జంపా, రాహుల్ చాహార్ వంటి స్పిన్నర్లతో చూస్తే అదిరిపోయేలా ఉంది సన్ రైజర్స్ స్క్వాడ్.

ఐపీఎల్-2024లో సన్ రైజర్స్ విధ్వంసం చేసింది. గత సీజన్‌లో పరుగుల వరద పారింటిన SRH..లీగ్ చరిత్రలోనే మూడుసార్లు రికార్డు హయ్యెస్ట్ స్కోరు నమోదు చేసింది. సంచలన ప్రదర్శనతో తృటిలో టైటిల్ కోల్పోయిన సన్‌రైజర్స్ ఈ సారి ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్‌కు సిద్ధమైంది.

సన్ రైజర్స్ ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌‌ను తక్కువ అంచనా వేయడానికి రాలేదు. ఆ జట్టులో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్మేయర్ రూపంలో బలమైన ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌‌పై హైదరాబాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచింది. ఈ సారి కూడా సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button