
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి :- మహాదేవపూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిన రైతులను పరామర్శించిన చల్లా నారాయణ రెడ్డి. మండల కేంద్రంలో భారీ ధాన్య నష్టం జరిగింది, పీఎసిఎస్ మరియు సంబంధిత సెంటర్ ఇంచార్జి నిర్లక్ష్యంతో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చెరువు పక్కన పెట్టడం వల్ల వేలాది క్వింటాల్ల ధాన్యం నీరు పాలు అయ్యింది. కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిన రైతులను పరామర్శించిన నేను బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజకీయాలు చేయడం మాత్రమే కాదు. ఓట్లు వేసి గెలిపించిన మా రైతులను వెంటనే ఆదుకోవాలి అన్నారు.
సంబంధిత అధికారులతో, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు అడిషనల్ కలెక్టర్ డిసివో తో మాట్లాడి తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలనీ బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు నీ నిర్లక్ష్యం వల్ల, రైతులకు అన్యాయం జరిగింది. ఈ సందర్బంగా నారాయణ రెడ్డి రైతుల ఏడుపులు మీకు కనిపించడం లేదా మంత్రి గారు. మీ నాయకత్వంలో అధికారులను, ప్రజాప్రతినిధులు భయబ్రాంతులకు గురి చేసి, కౌలుకు తీసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సింది పోయి, డబ్బులుకు ఆశపడి సెంటర్ ఇంచార్జ్లు, చైర్మన్ల ఏమరపాటు తో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వానికి రైతుల గోస, రైతుల ఏడుపులు కనిపించడం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, బీజేపీ నాయకులు అయిలన్న, పూర్ణచందర్,వెంకటేష్, సాగర్ల రవీందర్,సంతు,సంపత్ రాజు మరియు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్‌కు సమానస్థాయిలో లోకేష్ – స్పెషల్ అట్రాక్షన్‌గా అమరావతి పోస్టర్