
-
ఏడేళ్లు దాటిన చిన్నారులకు వెంటనే బయోమెట్రిక్ చేయాలి
-
ప్రభుత్వ పథకాలకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి
-
అప్‌డేట్ చేయపోతే ఆధార్ డీ యాక్టివేట్ అయ్యే ప్రమాదం: యూఏడీఏఐ
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: చిన్నపిల్లల ఆధార్ వివరాలపై యూఐడీఏఐ కీలక సూచనలు చేసింది. ఆధార్ బయోమెట్రిక్‌కు సంబంధించి ఉడాయ్ కీలక ప్రకటన చేసింది. ఏడేళ్లు నిండిన చిన్నారుల ఆధార్‌ను వెంటనే బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని సూచిచింది. మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కు వెళ్లి వెంటనే ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలంది. స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్, నగదు బదిలీ పథకాల వంటి ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అని తెలియజేసింది ఉడాయ్. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ చేయలేదంటే ఆధార్ డీ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.