
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఎన్నో కారణాలవల్ల మరణించడం జరిగింది. కొంతమంది రోడ్డు ప్రమాదాల ద్వారా, మరి కొంతమంది ఆత్మహత్యల ద్వారా, మరి కొంతమంది ఆరోగ్యం బాగు లేక చనిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా గొంతులో దోశ ఇరుక్కోవడం వల్ల రెండేళ్ల బాలుడు మృతి చెందడం అనేది రెండు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. ఇది ఎక్కడో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇక అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, తపోవనానికి చెందిన కుశల్ అనే రెండు సంవత్సరాల బాలుడు దోశ తింటుండగా… ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఆ బాలుడు వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కింద పడిపోయాడు. దీంతో వెంటనే పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బాలుడిని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కుశల్ అనే బాలుడిని పరిశీలించిన వైద్యులు… ఈ బాలుడు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో అభం..శుభం తెలియని పిల్లోడు అలా కాని రాణి లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. ఈ ఘటన విన్న గ్రామం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిండు నూరేళ్లు బతకాల్సిన బాలుడు… ఇలా అనూహ ఘటనతో మృతి చెందడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయ్యో పాపం … అని అనుకుంటున్నారు. ఎన్నో విధాలుగా మరణించడం చూసాం కానీ ఇలా అనూహ్య ఘటనతో మరణించడం అనేది… ఆ తల్లిదండ్రులకు తీరని లోటుగా మిగిలిపోయింది.