
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈనెల 26న రంగారెడ్డి జిల్లా టి డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ జిల్లా మహాసభ కందుకూరు మండల కేంద్రంలో శుభం కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమానికి మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గం టిడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ హాజరవుతానని తెలిపారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలని తెరపైకి తీసుకున్నరన్నారు. జర్నలిస్టులు నిరంతరం ప్రజా సంక్షేమ కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉంటారని వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నాయకులు శ్రీరాములు, దేవేందర్,మహేశ్వరం టీ డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షులు తడక నర్సింహా, కార్యదర్శి సురేందర్, శ్రీనివాస్, రాజేంద్రనగర్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి బుచ్చన్న యూనియన్ జర్నలిస్టు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read also: సీఎం సహాయ నిధి పేదలకు వరం : శ్రీనివాస సేవా సమితి చైర్మన్
Read also : పిచ్చి పిచ్చి వీడియోలు చేసి వాగుకు.. హోమ్ మినిస్టర్ పై మండిపడ్డ రోజా