అంతర్జాతీయం

సాయం చేసిన కృతజ్ఞత లేని టర్కీ.. పాకిస్తాన్ కు డ్రోన్లు సరఫరా

పాలుకు పాలు పోసి పెంచడం అంటే ఇదే. పాలుకు మనం ఎన్ని పాలు పోసినా అది తన బుద్ది మార్చుకోదు. సమయం వచ్చినప్పుడు విషం ఇచ్చి తన నైజం చాటుకుంటుంది. అందుకే పామును ఎప్పుడు వదలొద్దు అంటారు. ఇప్పుడు టర్కీ దేశం తీరు కూడా ఇలాగే ఉంది. భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసింది టర్కీ.

2023 సంవత్సరంలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8,45,590 డాలర్ల విలువైన సామగ్రి దేశం అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం అందించింది ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసారు.

గురువారం భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్‌కు 400 డ్రోన్లు యుద్ధ సామాగ్రి అందించారు.భారత్ పై దాడిలో బాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ/తుర్కియే దేశానికి చెందినవిగా ఇండియన్ ఆర్మీ గుర్తించారు

భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం ఇచ్చిందని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు. గురువారం అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300-400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది.. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button