ఆంధ్ర ప్రదేశ్

తొక్కిసలాట దురదృష్టకరం!.. ఇకపై అలా జరగకుండా చూస్తా :

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఆయన టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుమల అంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని, తిరుమల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, విచారించి, నిర్ధారించి రాయాలని కోరారు.

కుంటి సాకులు చెబుతూ… వ్యవసాయ రైతులను ముంచేశారు!

సోషల్‌ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం మంచిది కాదన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన తప్ప మిగిలిన ఏర్పాట్లన్నీ బాగున్నాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. అధికారుల శ్రమను మనం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి జరిగినవన్నీ ఈ రోజుతో వదిలేసి ఇకపై దేవుడి గురించి ప్రచారం చేయాలని అభ్యర్థించారు. గత ఆరు నెలలుగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూప్రసాదాలు, వసతి తదితర సేవలు అందిస్తున్నామని ఈవో చెప్పారు.

మకరజ్యోతి ఆరంభం !… శబరిమళలో భారీ బందోబస్తి?

దళారీ వ్యవస్థను కూడా కట్టడి చేశామని, విజన్‌ డాక్యుమెంట్‌ను కూడా రూపొందిస్తున్నామన్నారు. తొక్కిసలాట అంశంపై న్యాయ విచారణ జరుగుతోందని, అందులో పూర్తి విషయాలు వెలువడతాయని చెప్పారు. తిరుమలలో వసతి ఎవరికి కేటాయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి కేటాయిస్తున్నామని వెంకయ్యచౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో వసతి కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల వాట్సా్‌పకే పూర్తి సమాచారం, రిజిస్ర్టేషన్‌ చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు త్వరగా దర్శనం చేయించేలా విచక్షణ కోటాను, మానవ జోక్యాలను తగ్గించామని చెప్పారు.

మహా కుంభమేళ!… రెండు లక్షల కోట్లు ఆదాయం : సీఎం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button