Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్BR Naidu: మహిళతో రాసలీల వీడియోలు వైరల్‌.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్‌ నాయుడు!

BR Naidu: మహిళతో రాసలీల వీడియోలు వైరల్‌.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్‌ నాయుడు!

  • మహిళతో రాసలీలల వ్యవహారంపై స్పందించిన బీఆర్ నాయుడు

  • డీప్‌ ఫేక్‌ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

డీప్‌ ఫేక్‌ వీడియోలతో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. మహిళతో బీఆర్‌ నాయుడు రాసలీలలు అంటూ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై ఆయన స్పందించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌ ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే రాజీనామా చేయాలని అంటున్నారని తెలిపారు. వాళ్ల అవినీతి బండారం బయటకు వస్తుందనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

భూమన, సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తా!

వైసీపీ హయాంలో ఎన్నో స్కామ్‌లు జరిగాయని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే వాటిని బయటపెట్టడం లేదని పేర్కొన్నారు. భూమన, సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. వారి చీప్‌ పాలిటిక్స్‌ తన దగ్గర నడవవని అన్నారు. సీఎం చంద్రబాబు సూచనతోనే ఇంతకాలం ఆగానని చెప్పారు. ఈ వ్యవహారంపై లీగల్‌గా పోరాడతానని స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్‌ విచారణ అంశం నుంచి డైవర్ట్‌ చేసేందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. కరుణాకర్‌ రెడ్డి, జగన్‌ దోపిడీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని అన్నారు. టీటీడీ కోసం నేను నిస్వార్థంగా పనిచేస్తున్నానని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ తో విహారయాత్రకు వెళ్లడంలో తప్పేముందని అన్నారు.

డీప్‌ ఫేక్‌ వీడియోలతో దుష్ప్రచారం

అంతకుముందు ఎక్స్‌ వేదికగా బీఆర్‌ నాయుడు స్పందించారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధంగా వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేసుకునేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ నాయుడు మండిపడ్డారు. ఏఐ సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించేవిధంగా వీడియోలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకమని వ్యాఖ్యానించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అన్నారు. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీఆర్‌ నాయుడు మండిపడ్డారు. దీనిపై నేను చట్టప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్‌మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments