క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ఆయన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. రాష్ట్రంలో ఆయనపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ హైకమండ్ వద్ద ఆయనకు పలుకుబడి లేదని ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అపాయింంట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఫోటోలు దిగి రిలీజ్ చేసుకోవాల్సిన పొజిషన్ కంటే ఇంకా చాలా ఎత్తులో ఉన్నానని ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు.
సైఫ్ అని తెలియకుండానే పొడిచాడు.. పోలీసుల విచారణలో నిజాలు
తెలంగాణలో గ్యారంటీల అమలుపై మంచి ఒపీనియన్ ఉండటంతో ఆయనతో ప్రచారం చేయించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్రలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో రెండు హామీలను రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఆవిష్కరించారు. దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హైకమాండ్ వద్ద ఆయన పలుకుబడి అంతకంతకూ పెరుగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే రేవంత్ రెడ్డికి కీలక అంశాల్లో ప్రాధాన్యత లభిస్తోంది.