క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు జీవన్ రెడ్డి వైపే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధానికి గుడ్ బై చెబుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కెసిఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధినేత కెసిఆర్ లతో భేటీ అయ్యారు జీవన్ రెడ్డి. త్వరలోనే ఆ పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి చేరికతో భారత రాష్ట్ర సమితికి వచ్చే ప్రయోజనం. కలిసివచ్చే నాయకులు? భవిష్యత్తులో జీవన్ రెడ్డి ఎలాంటి ప్రభావం చూపుతారో అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది.
సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జీవన్ రెడ్డి నందమూరి తారక రామారావు తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. ప్రారంభం నుంచి కెసిఆర్ తో రాజకీయ వైరం ఉంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన కెసిఆర్ వద్దకు చేరారు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన దారుణ అవమానంతోనే ఆయన గులాబీ బాట పట్టారు. తన రాజకీయ ప్రయోజనం కంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పతనం గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
కొత్తగా ప్రచారం
కానీ జీవన్ రెడ్డిని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిందన్న ప్రచారం నడిచింది. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ హై కమాండ్ తేలికగా తీసుకుందన్న ప్రచారం నడిచింది. అయితే జీవన్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి చివరి వరకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పుడు కొత్త ప్రచారం ప్రారంభమైంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఏకంగా రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డికి ఆ విషయం చెప్పారో లేదో కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత దానం నాగేందర్ ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించారు. జీవన్ రెడ్డి మంచి అవకాశాన్ని వదులుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దానం వ్యాఖ్యలు పొలిటికల్ గా హాట్ రేపుతున్నాయి. అయితే వ్యూహంలో భాగంగానే దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
డామేజ్ కంట్రోల్ కోసమే..
జీవన్ రెడ్డి దాదాపు టిఆర్ఎస్ లో చేరేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం మొదలు పెట్టింది. కానీ ఇప్పటికే గులాబీ పార్టీలో జీవన్ రెడ్డికి ఒక్క పెద్ద పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి వరకు ప్రయత్నించినట్లు.. అయినా సరే జీవన్ రెడ్డి ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నట్లు ప్రచారం చేస్తోంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఎదురయ్యే పొలిటికల్ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకే దానం నాగేందర్ తో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు పొలిటికల్ పండిట్స్ వ్యక్తం చేస్తున్నారు.
