
Donald Trump Warning: పన్నుల విషయంలో కఠిన విధానాలు అవలంభిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చాడు. బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ షాకింగ్ కామెంట్స్ చేశారు. బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు ట్యాక్స్ లు విధించబోతున్నట్లు ప్రకటించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్న ట్రంప్.. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు పెట్టారు. “అమెరికా వ్యతిరేక విధానాలను పాటిస్తున్న బ్రిక్స్ దేశాలకు అనుకూలంగా ఉన్న అన్ని దేశాలకు 10 శాతం అదనంగా పన్నులు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు” అని తేల్చి చెప్పారు. బ్రెజిల్ లో బ్రిక్స్ సదస్సు జరుగుతుండగానే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు
బ్రెజిల్ లోని రియో డీ జెనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బ్రిక్స్ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సమావేశం పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు వ్యతిరేకించాల్సిందేనని బ్రిక్స్ దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు రియో డీ జెనీరో డిక్లరేషన్ ను విడుదల చేశాయి. అటు బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందన్నారు. తమ దేశం ఉగ్రవాద బాధిత దేశంగా కొనసాగుతుందన్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ.
Read Also: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, హైదరాబాదీ ఫ్యామిలీ సజీవ దహనం!