
Supreme Court On Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని మోడీ దాన్ని సరెండర్ చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సుప్రీ తీవ్రంగా మండిపడింది. ఈ కేసుపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్‌ల బెంచ్ విచారణ జరపింది. 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారు? మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కదా? అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ఇలాంటి మాటలు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ కేసును కొట్టివేయాలన్న రాహుల్ విజ్ఞప్తిపై కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసు కొనసాగనుందని చెప్పింది.
రాహుల్ పిటిషన్ ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
గత మే నెలలో అలహాబాద్ హైకోర్టు కూడా రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది. లక్నోలో ప్రత్యేక కోర్టు రాహుల్‌కు ఫిబ్రవరిలో సమన్స్ జారీ చేసి, ఆయనపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు జడ్జి సుభాష్.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంటే సైన్యాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు కాదని తేల్చి చెప్పారు. ఈ కేసు మొదట 2022 డిసెంబర్‌లో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో బయటకొచ్చింది. సైన్యం గురించి రాహుల్ గాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్ మాత్రం ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమని చెప్పారు. రాహుల్ ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చారు. 2023 జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ లోనూ, చైనా మన భూమిని ఆక్రమించిందన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది. ప్రస్తుతం ఆయా కోర్టుల్లో రాహుల్ పై కేసులు కొనసాగుతున్నాయి.
Read Also: రాహుల్ లాగే.. చిదంబరం.. ఎన్నికల సంఘం ఆగ్రహం!