ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణ

టాలీవుడ్ ట్రెండింగ్ లో సీక్వెల్ సినిమాలు!.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సీక్వెల్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా ధియేటర్లో విడుదల చేయగా అది మంచి సక్సెస్ నువ్వు అందుకుంటే చాలు వెంటనే ఆ సినిమాకి సీక్వెల్ ను జత చేస్తున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉదాహరణకు తీసుకుంటే అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆర్య మొదటి భాగాన్ని అలాగే రెండో భాగాన్ని కూడా పూర్తిచేసుకుని మంచి విజయం అందుకొని మొట్టమొదటిగా టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చినటువంటి బాహుబలి కూడా పెద్ద హిట్ అవడంతో ఇక అందరూ కూడా సీక్వెల్ రూపంలో సినిమాలను తీస్తున్నారు.

ఇలా సీక్వెల్స్ పై చాలామంది సినిమా హీరోలు ప్లాన్స్ కూడా చేస్తున్నట్లు సినిమా ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కాంబినేషన్లో సలార్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే సలార్ రెండవ భాగం కూడా ఇప్పటికే షూటింగ్ దాదాపుగా 40 శాతం పూర్తయిందట. ఇక మరోవైపు ఈ మధ్యనే రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దేవరా సినిమా కూడా రెండో భాగాన్ని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట.

కాబట్టి ఇలా మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ సినిమా తీసిన కూడా సీక్వెల్స్ గా తీయడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది. అంతేకాకుండా పెద్ద హీరో అయితే చాలు ఏకంగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తీసేస్తున్నారు. మంచి హీరో అయితే బడ్జెట్ ఎంతైనా కూడా వెనకడుగు వెయ్యట్లేదు నిర్మాతలు. సినిమా హిట్ అయినా లేదా ఫ్లాప్ అయినా సీక్వెల్ తీయడం మాత్రం ఆపట్లేదు. ఉదాహరణకి శంకర్ మరియు కమలహాసన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఇండియన్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. వేరే కథతో అదే ఇండియన్ 2 సినిమాను చేయగా అది అత్తర్ ఫ్లాప్ అయింది. అయితే ఏది ఏమైనా సరే మంచి హీరోలు కథను యాక్సెప్ట్ చేస్తే చాలు బడ్జెట్లోనూ ఇటువంటి లోటు లేకుండా ఎంతైనా పెట్టేస్తున్నారు నిర్మాతలు. మరి ముందు ముందు ఇంకెన్ని సీక్వెల్స్ గా సినిమాలు వస్తాయో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button