
క్రైమ్ మిర్రర్,నిజామాబాద్:- బాన్సువాడ టౌన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తతో జరిగిన మాటా మరీ మాట పెరిగి.. క్షణికావేశం అపర్ణ(30) ప్రాణాలు తీసుకుంది. పట్టణానికి చెందిన గొడుగు కాశీనాథ్ కు, కంగ్టి మండలానికి చెందిన అపర్ణ 2019లో వివాహం జరిగింది. దంపతులకు 3ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అపర్ణ, అత్త సాయవ్వ మధ్య వాగ్వాదం తలెత్తింది. మనస్థాపంతో అపర్ణ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుంది. వెంటనే విషయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Read also : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు 4 మృతి!
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు నిజామాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే బాన్సువాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అపర్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also : నవంబర్ 5న కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో కాశి వెలుగులు!





