
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అర్జున్ నాయనమ్మ అనగా.. అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం. వయస్సు రీత్యా కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా అల్లు కనకరత్నమ్మ ఇవాళ అర్ధరాత్రి 1.45 గంటలకు వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే అల్లు అరవింద్ దగ్గరుండి కార్యక్రమాలు చూసుకుంటుండగా.. అల్లు అర్జున్ ముంబై నుంచి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. మరణించిన కనకరత్నం స్వయానా చిరంజీవికి అత్త అవుతుంది. ఇక రామ్ చరణ్ కు అమ్మమ్మ అవుతుంది.
Read also : ట్రంప్ కు షాక్, సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న యుఎస్ కోర్టు
ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కూడా వెంటనే మైసూర్ నుంచి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరుగుతాయని అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇప్పటికే ప్రకటించింది. బంధువులు అలాగే కొంతమంది ప్రముఖులు వచ్చి నివాళులు తెలిపేటువంటి అవకాశం ఉంది. అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు కూడా అంత్యక్రియలకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే నేడు జనసేన బహిరంగ సభ వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి. కనక రత్నం మరణ వార్త తెలుసుకున్న బంధుమిత్రులు అలాగే సినిమా ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఈమె ఆసుపత్రిలో కూడా చేరిందట.
Read also : అమిత్ షా తల నరకాలి, టీఎంసీ ఎంపీ మహువా షాకింగ్ కామెంట్స్!