
-
కుక్కల అనిరుధ్ (3)కు పోయిన కన్ను
-
అనిరుధ్ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
గాయపడినవారంతా పదేళ్లలోపు చిన్నారులే
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం సృష్టించాయి. కుక్కల దాడిలో ఒకేరోజు 25మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో అనిరుధ్ (3) చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. అనిరుధ్‌కు ఓ కన్నుపోయింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరూ 10ఏళ్ల లోపే చిన్నారులే. అందరికీ తూప్రాన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రజలంతా బోనాల పండగలో బిజీగా ఉన్న సమయంలో కుక్కలు దాడి చేశాయి. వరుసగా దాడి చేసుకుంటూ వెళ్లి 25మందిని గాయపరిచాయి. కుక్కల బెదదపై తూప్రాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నుంచి రక్షణ కల్పించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. పెద్దవాళ్లు బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని… ఇక చిన్నారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చని స్థానికులు వాపోతున్నారు.
Read Also: