
-
రూ.4లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ టీపీవో
-
పట్టుబడ్డాక బోరున విలపించిన మణిహారిక
-
ఓ ప్లాట్ ఎల్‌ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ విరుచుకుపడుతోంది. దాదాపు ఆర్నెళ్ల నుంచి రోజుకో అధికారి ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ పంజా విసురుతున్నా లంచగొండి అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇవాళ హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఓ వ్యక్తి నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్ అధికారిణి మణిహారిక రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు. ఓ ప్లాట్ క్లియరెన్స్ కోసం మణిహారిక రూ.10లక్షలు డిమాండ్ చేసింది. ఈరోజు రూ.4లక్షలు తీసుకుంటుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన తర్వాత మణిహారిక బోరున విలపించారు.