క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలు వల్ల ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయానని నిర్మాత రమేష్ ఆవేదన చెందాడు. పవన్ కళ్యాణ్ తో తీసిన కొమరం పులి అలాగే మహేష్ బాబు ఖలేజా ఈ రెండు సినిమలు నాకు 100 కోట్ల రూపాయలు నష్టం తెచ్చి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ‘ నేను సినిమాలు చేసే టైంలో మూడేళ్ల పాటు ప్రొడక్షన్ అనే కాన్సెప్టే లేదు’… ఏ సినిమా అయినా ఆరు నెలల్లోనే పూర్తయ్యేవి అని అన్నారు. కానీ నా తలరాత బాగోలేక ఆ సినిమాలు మూడేళ్లు నిర్మాణంలోనే కొనసాగాయని, తద్వారా చాలా లాస్ అయ్యానని భావోద్వేగం చెందాడు. ఈ రెండు సినిమాల వల్ల నష్టం వచ్చి ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క హీరో పట్టించుకోలేదని బాగోద్వేగానికి లోనయ్యాడు. ఏ ఒక్కరు కూడా ఆ సమయంలో ఫోన్ చేసి పరామర్శించిన పాపాన కూడా పోలేదని తాజాగా ఓ ఈవెంట్లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చూడండి
1. కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు!… చాలా రోజుల తర్వాత జగన్ ఫైర్?